‘బట్టల రామస్వామి బయోపిక్కు’ టీజర్ రిలీజ్

by  |
Battala Ramaswamy Biopikku
X

దిశ, వెబ్‌డెస్క్: అల్తాఫ్ హసన్, శాంతీరావ్, సాత్విక, లావణ్య రెడ్డి, శ్రీ చందన, శ్రీ వర్ధన్, నటరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. నూతన నటీ నటులతో కామెడీ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఇటీవల జరిగింది. మ్యాంగో మీడియా ప్రెజెంట్స్, సెవన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్, రామ కృష్ణ వీరపనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేయగా అందర్నీ ఆకట్టుకుంటుంది. జీవిత చరిత్రలు పెద్ద నాయకులు, సినిమా యాక్టర్లకే కాదు సామాన్య మనుషులకు కూడా ఉంటాయి అంటూ మొదలైన టీజర్ లో ఒక్కోపాత్రను పరిచయం చేశారు.

Next Story