ఏప్రిల్ 1 నుండి మారనున్న బ్యాంక్ రూల్స్.. అవి ఏంటో తెలుసా?

by  |
ఏప్రిల్ 1 నుండి మారనున్న బ్యాంక్ రూల్స్.. అవి ఏంటో తెలుసా?
X

దిశ,వెబ్ డెస్క్: కొత్త ఆర్ధిక సంవత్సరం వచ్చేసింది. దాంతో పాటు కొన్ని కొత్త రూల్స్ ని కూడా వెంట తెచ్చేసింది. అనేక అంశాల్లో ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో కొత్త నియమాలను అమలు చేయనున్నారు.భారత ప్రభుత్వం 8 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి 3 బ్యాంకులుగా మార్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పాత బ్యాంకులకు సంబంధించిన పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌ లు ఏప్రిల్ 1 నుండి పనిచేయవు. జయా బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్ కస్టమర్ల పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌ ల తో పాటు ఐఎఫ్ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ వంటివి కూడా మారనున్నాయి.

ఇంకా అంతేకాకుండా ఆదాయపు పన్ను విషయంలో కూడా కొన్ని మార్పులు జరగనున్నాయి. ఏప్రిల్ 1 తర్వాత 75 ఏళ్ల పైన ఉన్నవారు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ ద్వారా, ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నవారికి ఇది వర్తిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఏప్రిల్ 1 నుండి కొత్త వేతన కోడ్ అమలులోకి రానుంది. ఈ కోడ్ ద్వారా బేసిక్ పే పెంచుతారు. దీంతో బేసిక్ పే పెరిగితే అందులో 12 శాతం పీఎఫ్‌ అకౌంట్‌లో జమ చేయాలి. పీఎఫ్ పెరిగితే ఉద్యోగస్తుల టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది. వీటితో పాటు ఏప్రిల్ 1 నుంచి టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం రేట్స్ పెరగనున్నాయి.

Next Story

Most Viewed