‘బంగారు బుల్లోడు’ రిలీజ్ డేట్ ఫిక్స్

by  |
‘బంగారు బుల్లోడు’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లరి నరేష్, పూజా ఝవేరి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బంగారు బుల్లోడు’. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న సినిమాకు రామబ్రహ్మం డైరెక్టర్. ఈ నెల 23న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్ సభ్యులు మూవీ సక్సెస్‌పై నమ్మకంగా ఉన్నట్లు తెలిపారు.

ఫుల్ లెంత్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేసేందుకు ఎగ్జైట్ అవుతున్నట్లు చెప్పారు. సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్ చాలా బాగుందన్న హీరో అల్లరి నరేష్..‘స్వాతిలో ముత్యమంత’ సాంగ్ రీమేక్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘బంగారు బుల్లోడు’ చిత్రానికి తమ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బంగారం షాప్‌, గ్రామీణ బ్యాంక్‌లో పని చేసే వ్యక్తి.. బంగారం తాకట్టు పెట్టి రుణాలు ఇచ్చే కథ మా ‘బంగారు బుల్లోడు’ కథ అని క్లారిటీ ఇచ్చారు.

Next Story