'తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి'

by  |
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
X

దిశ, మెదక్: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆయన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. అకాల వర్షం రైతులను కంటతడి పెట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట విక్రయించే దశలో తడిసిపోవడం ఎంతో బాధాకరమన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారితో సతమతమౌతుంటే, దానికితోడు అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఉపాధ్యక్షుడు మైపాల్ రెడ్డి, ఎంపీటీసీ కొలిపాక రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: bandi sanjay, pady purchasing centre, visit, medak, ts news

Next Story