న‌శం పెట్టి కొడితే.. మేము జండుబాం క‌లిపి కొడతాం

by  |
Bandi Sanjay
X

దిశ‌,తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీని న‌శం పెట్టి కొడ‌తామ‌ని వెట‌కారం చేస్తున్నార‌ని, కానీ ఆయ‌న న‌షం పెట్టి కొడితే మేము న‌షానికి జండు బాం క‌లిపి కొడుతామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ ఫైర్ అయ్యారు. గురువారం రాష్ట్ర కార్యాల‌యంలో బీజేపీ యువ‌మోర్చా రాష్ట్ర కార్యవ‌ర్గ స‌మావేశంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చీమ‌లు పెట్టిన పుట్టలో పాములు చొచ్చిన‌ట్లు కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దాపురించింద‌ని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ‌ర్జెన్సీ నాటి ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, ఆ ప‌రిస్థితులు ‌పోవాలంటే తెలంగాణ‌లో మ‌లి ద‌శ ఉద్యమం రావాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు.

సీఎం కేసీఆర్ 13 వేల కంపెనీలు వ‌చ్చాయని, 5ల‌క్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామ‌ని చెబుతుండ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. నిరుద్యోగుల‌కు ప్రభుత్వ ఉద్యోగాల క‌ల్పనపై ప‌చ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. ఉద్యోగ క‌ల్పన గురించి మాట్లాడే ముందు ఆయ‌న టీఎస్ పీఎస్సీలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను ఎప్పుడు భ‌ర్తీ చేస్తారో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థల‌కు బాస‌ట‌గా నిలుస్తున్న కేసీఆర్ వేలాది మంది నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పించే చిన్న విద్యా సంస్థల‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్రశ్నించారు.

బీజేపీ,యువ‌మోర్చా కార్యక‌ర్తలు ఎవ‌రికి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, భ‌య‌ప‌డే వారు యువ‌మోర్చాలో ఉండాల్సిన ప‌ని లేద‌న్నారు. రాష్ట్ర బీజేపీ నాయ‌క‌త్వం స్పష్టమైన విధానంతో ముందుకెళ్లుతుంద‌ని, 2023లో అధికార‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోంద‌న్నారు. బీజేపీ అంటే త్యాగాల‌కు మారుపేర‌ని, అనేక టెర్రరిస్టు,న‌క్సలైట్ బెదిరింపుల‌ను ఎదుర్కోని ఎంతో మంది కార్యక‌ర్తలు ప‌ని చేశార‌ని గుర్తు చేశారు.

Next Story

Most Viewed