సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

135
bandi-sanjay-12

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఫైరయ్యారు. శనివారం ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 317 జీవోను సవరించాలంటూ ప్రగతి భవన్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అరెస్టు చేసిన టీచర్లందరినీ ప్రభుత్వం తక్షణమే భేషరతుగా విడుదల చేయాలి ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలని, అప్పటివరకూ ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. 317 జీవోను సవరించేదాకా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.