సిగ్గుంటే కేటీఆర్ రాజీనామా చేయాలి.. బండి సంజయ్ ప్రతి సవాల్

148

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ సర్కార్ కట్టే పన్నుల కంటే రాష్ట్రానికి కేంద్రం తక్కువగా నిధులు ఇస్తోందని.. ఎక్కువగా ఇస్తోందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న కేటీఆర్‌ సవాల్‌ను బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. గురువారం కామారెడ్డి జిల్లా బంజారాతండాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్‌ తన సవాల్‌కు కట్టుబడి ఉంటే.. మోడీ అపాయింట్మెంట్ తీసుకుంటానని.. లెక్కలు తేలుస్తా అన్నారు.

గత ఏడేళ్లలో పన్నుల వాటా, ప్రయోజిత పథకాలు, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే, ఫ్రీ వ్యాక్సిన్ పేరిట ఇప్పటి వరకు రూ.2 లక్షల 52 వేల కోట్లు తెలంగాణకు చెల్లించిందన్నారు. ఇవి కేవలం ఐదాంశాల్లో మాత్రమేనని, దేశ రక్షణ, విమానయాన, శాటిలైట్ నిర్వహణ, జాతీయ విపత్తు వంటి అంశాల్లో కేంద్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సవాల్ విసిరిన మంత్రికి ఏ మాత్రం సిగ్గున్నా రాజీనామా చేసి తీరాలని ప్రతి సవాల్ విసిరారు బండి సంజయ్. తెలంగాణకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేస్తున్నారని.. పార్లమెంట్‌లో ఇవే ప్రశ్నలడిగితే చట్టసభల సాక్షిగా టీఆర్ఎస్ నేతల బండారం బయటపడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..