దసరా తర్వాత పరిష్కరిస్తా.. కార్మికులకు బండి సంజయ్ హామీ

by  |
Bandi Sanjay
X

దిశ, మెదక్: మెదక్ జిల్లా మంబోజిపల్లి సమీపంలోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ వద్దకు సోమవారం సాయంత్రం బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేరుకుంది. అక్కడ కాసేపు ఆగి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి శోభ కరంజితో కార్మికుల సమస్యలు విని చలించిపోయారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు పల్లె సిద్ధరాములు గౌడ్ సమస్యలు విన్నవించారు. గత ఆరేండ్ల నుంచి ఫ్యాక్టరీని మూసివేశారని, ఫ్యాక్టరీ యాజమాన్యం కనీసం మాకు సెటిల్మెంట్ కూడా చేయలేదని వాపోయారు. అనేకమంది కార్మికులు చనిపోయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పార్లమెంట్‌లో కార్మికులకు పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి శోభకు విన్నవించారు. దసరా తరువాత ప్రత్యేక కార్యక్రమం తీసుకొని మీ సమస్యలను పరిష్కరిస్తామని బండి సంజయ్ కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ యాత్రలో కార్మిక నాయకులు కిషన్, ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ఎన్ఎల్ఎన్ రెడ్డి, సుభాష్ గౌడ్, మధు, రవీందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

Next Story