అమ్మకాల్లో 10 లక్షల మైలురాయిని సాధించిన మారుతి సుజుకి కారు!

by  |
maruthibaleno
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మోడల్ బలెనో కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు ఈ మోడల్ కారు మొత్తం 10 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించినట్టు కంపెనీ వెల్లడించింది. బలెనో మోడల్ మొదటిసారిగా 2015, అక్టోబర్‌లో విడుదలైంది. ప్రధానంగా కంపెనీ ఈ మోడల్‌ను ప్రీమియం రిటైల్ విభాగం నెక్సా కేంద్రాల్లో విక్రయిస్తోంది.

ఈ మోడల్ ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే లక్షల యూనిట్లను, 2018లో ఈ మోడల్ 5 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఆ తర్వాత ఐదు లక్షల యూనిట్ల విక్రయాలను మూడేళ్లలో పూర్తి చేయడం సంతోషంగా ఉందని కంపెనీ పేర్కొంది. ‘బలెనో మోడల్ విడుదల చేసినప్పటి నుంచి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మెరుగైన స్పందనను సాధించింది. వినియోగదారుల నుంచి మెరుగైన స్పందన రావడంతో మొత్తం ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఈ మోడల్ 25 శాతానికి పైగా వాటాతో కొనసాగుతోందని’ మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed