ఒంటరిగా ఉన్నవారిని బెదిరించి.. అలా చేయడం వారికి జల్సా

by  |
ఒంటరిగా ఉన్నవారిని బెదిరించి.. అలా చేయడం వారికి జల్సా
X

దిశ, కుత్బుల్లాపూర్ : జల్సాల కోసం దారి దోపిడీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న దొంగలను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నర్సింహారెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం… ఫిల్మ్ నగర్ ఇందిరానగర్లో నివాసముండే వినయ్(22), మహేష్(19), విజయ్(20) మణిదీప్(23), అర్జున్(25), వీరేష్(21), మరో నలుగురు యువకులు రెండు ముఠాలుగా ఏర్పడ్డారు. జొమాటో, స్విగ్గీ లలో డెలివరీ బాయ్లుగా పని, కొందరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటారు. సాయంత్రం విధులు ముగించుకున్న తర్వాత స్థానికంగా గల ఓ పార్కులు అందరు కలిసి మద్యం సేవించడం జరుగుతుంది. అంతే కాకుండా సాయంత్రం సమయంలో సరదాగా బైక్ రైడింగ్లకు పాల్పడుతుంటారు.

జల్సాలకు అలవాటుపడిన ఈ ముఠా ప్రగతినగర్, బాచుపల్లి ప్రాంతాల రొడ్డుపై ఒంటరిగా ఉన్నవారిని బెదిరించి సెల్ ఫోన్లు, నగదు దోచుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇలా గత సంవత్సర కాలంలా 10 దారిదోపిడీలు చేసి అనుకున్న పనులు కానిచ్చేవారు. ఇదిలా ఉండగా మార్చి 15వ తేదీన రాత్రి 9:30 గం.లకు బళ్లారి సంతోష్ అనే యువకుడు రోడ్డుపై నిల్చుని స్నేహితుని కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో రెండు ద్విచక్రవాహనాలపై వేగంగా వచ్చిన దుండగులు అతని వద్దకు చేరుకుని అతన్ని బెదిరించి విలువైన సెల్ ఫోన్ దోచుకెళ్లారు. సదరు యువకుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. రాకేష్, దిలిప్, కిరణ్లు మినహా వారందరని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాలను అంగీకరించారు. బాచుపల్లి పీఎస్ పరిధిలోనే 10 దోపిడీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద 11 సెల్ ఫోన్ లు, రూ.1800ల నగదు, 2 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వినయ్,మహేష్, విజయ్, మణిదీప్, అర్జున్, వీరేష్ లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నేరస్తులను పట్టుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

Next Story

Most Viewed