(వీడియో): అవును!! చూడండి ఆ పాపకాళ్లని దెయ్యమే లాగుతోంది

226

దిశ,వెబ్‌డెస్క్: అనగనగా ఓ ఇల్లు. రాత్రైతే కనిపించే ఓ తెల్లటి ఆకారం. చీకటి పడితే వెన్నులో వణుకుపుడుతోంది. ఇదంతా సినిమా కాదు యదార్ధ గాధ అంటున్నాడు ఆ ఇంటి ఓనర్ . ఇంతకీ వారిలో భయానికి కారణమేంటి? ఓనర్ ను వణికిస్తున్నదెవరూ? ఇదే విషయాన్ని ఓనర్‌ని అడిగితే చంద్రముఖి సినిమాను మించిన హర్రర్ స్టోరీ చెబుతున్నాడు.

యూకేకి చెందిన జోష్ డీన్ బెడ్ రూమ్ లో నిద్రిస్తున్న నా కుమార్తె ను దెయ్యం బెడ్ కిందకి లాగిందంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం దెయ్యం వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. జోష్ డీన్ చెప్పినట్లుగా.. ఫిబ్రవరి 21న మా చిన్న పాప బొమ్మలతో ఆడుకుంటూ మంచం చివరిలో పడుకుంది. అయితే, రాత్రి 11:37 గంటలకు, రూమ్ లో వింత ఘటన జరిగింది. ఆమె తన మంచం మీదనుండి లేచి కిందకు వెళ్లింది. వెళ్లే సమయంలో పలుమార్లూ ‘మమ్మీ’ అని పలుసార్లు అరించింది. ఆమె అరుస్తున్నప్పుడు ఆమె కాళ్ళను ఎవరో పట్టుకొని కిందకు లాగినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. గదిలో జరిగిన ఇన్సిడెంట్ అంతా మా ఇంట్లో ఉన్న సీసీ టీవీ పుటేజీలో రికార్డ్ అయ్యిందని చెప్పాడు.

♦అయితే ఆ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. నిద్రలేచిన పాప వాళ్ల మమ్మీ కోసం వెతుకుంది’అని ఒకరంటుంటే

♦మరొకరు అవును పాపకాళ్లని ఆ దెయ్యమే లాగుందని మరొకరు కామెంట్ చేస్తున్నారు.

♦మరికొందరు ఇంట్లో దెయ్యం నాకేం భయం అంటూ దెయ్యం లేదని కొట్టిపారేస్తున్నారు. నిద్రలేస్తే పాప డైరెక్ట్ గా మంచం కిందకు ఎందుకు వెళుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ దెయ్యం ఇన్సిడెంట్ నెట్టింట్లో హాట్ టాపిగ్గా మారింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..