రేపటి నుంచి 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'

by  |
రేపటి నుంచి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సులో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు శుక్రవారం నుంచి తెలంగాణలోనూ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. వరంగల్ పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో 75 వారాల పాటు ఈ వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.25 కోట్లను మంజూరు చేసింది. వేడుకల నిర్వహణకు ప్రభుత్వ సలహాదారు రమణాచారి అధ్యక్షతన ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటైంది. వచ్చే ఏడాది పంద్రాగస్టు వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తి పెంపొందించే విధంగా కార్యక్రమాలు రూపొందించారు. రాష్ట్రంలో మొత్తం 75 చోట్ల జాతీయ పతాకాలను ఎగురవేయడానికి 75 ఎత్తయిన స్థూపాల నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం సంజీవయ్య పార్కులో ఉన్న తరహాలో 75 చోట్ల ఇలాంటివి ఏర్పాటు కానున్నాయి. ఈ సందర్భంగా బీఆర్‌కే భవన్‌ను మూడు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.



Next Story

Most Viewed