భార్యపై ప్రేమకు కొత్త నిర్వచనమిచ్చిన హీరో

by  |
భార్యపై ప్రేమకు కొత్త నిర్వచనమిచ్చిన హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: భార్య మీద తనకున్న ప్రేమ గురించి ఓ హీరో చాలా వెరైటీగా వివరణ ఇచ్చుకున్నాడు. విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలే కాదు, మాటల్లోనూ, భార్య మీద ప్రేమ చూపించడంలోనూ తనదైన శైలి చాటుకున్నాడు. లక్నోలో శనివారం జరిగిన హిందుస్తాన్ శిఖర్ సమగం 2020లో బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా, తన భార్య తాహిరా కశ్యప్‌తో కలిసి పాల్గొన్నారు.

2012లో ఆయుష్మాన్ తెరంగేట్రం చేసే నాటికే అతనికి పెళ్లి అయింది. మిగతా హీరోల్లాగ మీరు కూడా పెళ్లైన సంగతి దాచిపెడితే బాగుండేది కదా, ఎందుకు దాచి పెట్టలేదు అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పక్కింటోడి భార్య కూడా అసూయ పడి మనతో ప్రేమలో పడే విధంగా మన భార్యను ప్రేమించాలి అని ఆయన ఇచ్చిన జవాబుకి అందరూ ఆశ్చర్యపోయారు.

Next Story

Most Viewed