అయోధ్యలో ‘రియల్’ భూమ్.. గజం ఏకంగా ఎన్ని రేట్లు పెరిగిందంటే..?

by Rajesh |
అయోధ్యలో ‘రియల్’ భూమ్.. గజం ఏకంగా ఎన్ని రేట్లు పెరిగిందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఘనంగా జరిగింది. ఇక రేపటి నుంచి సాధారణ భక్తులకు దర్శనం కల్పించనున్నారు. దేశ నలుమూలల నుంచి వివిధ ప్రాంతాల నుంచి అయోధ్య రామ మందిర దర్శనానికి ప్రజలు భారీగా వెళ్లనండటంతో ఒక్క సారిగా పర్యాటకుల తాకిడి పెరగనుంది. ప్రతి రోజు దర్శనానికి లక్ష మంది వస్తారని.. ఏడాదికి 3.5 కోట్ల మంది వరకు అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శిస్తారని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అయోధ్య వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు వెల్లడైన నాటి నుంచే భూముల ధరలు అమాంతం పెరిగాయి.

2019 నుంచి పెరుగుదల ఉండగా ప్రస్తుతం మందిర దర్శనం స్టార్ట్ కానుండటంతో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే గతంలో రూ.2వేలకు గజం ఉన్న భూమి ధర ఏకంగా పదింతలు పెరిగి రూ.20 వేలకు చేరుకున్నట్లు తెలిసింది. అంటే 200 గజాల స్థలానికి గతంలో రూ.4లక్షలు ధర పలకగా అది ఏకంగా రూ.40 లక్షలు పలకనుంది. మందిర నిర్మాణ సమయంలోనే టెంపుల్ నుంచి 5-10 కిలో మీటర్ల వరకు ధరలు వీపరీతంగా పెరిగాయి. భక్తుల తాకిడి రేపటి నుంచి పెరగనుండటంతో భూములు ధరలు వచ్చే 5-10 ఏళ్లల్లో ఏకంగా అమాంతం 12-20 రేట్లు పెరిగే చాన్స్ ఉన్నట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు. గోరఖ్ పూర్, ఫైజాబాద్ హైవేపై సైతం భూములపై భారీగా పెట్టుబడి పెడుతున్నట్లు తెలిసింది. అయితే ఒక్కసారిగా భూములకు తాము ఊహించని రేట్లు వస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed