అయోధ్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

124
Ayodhya-Poster-Released11

దిశ, నల్లబెల్లి: మండల కేంద్రంలో అయోధ్య భవ్య శ్రీరామ మంధిర బస్సు యాత్ర గోడ పోస్టర్ ను ఎర్రబెల్లి జ్యోతి మదన్ మోహన్ రావు ఫౌండేషన్ చెర్మెన్ మదన్ మోహన్ రావు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అయోధ్య బస్సు యాత్ర మార్చి 13న నర్సంపేట నుండి బయలు దేరుతుందన్నారు. ఈ యాత్రలో పాల్గొనదల్సినవారు ఫిబ్రవరి మొదటి వారంలో ఆధార్ కార్డు కోవిడ్ సెకండ్ డోస్ జనవరి 31 వరకు పూర్తయిన సర్టిఫికెట్ తీసుకుని ఉండాలన్నారు. ఈ బస్సు యాత్రలో 500 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. 50 సంవత్సరాల వయసు పైబడినవారికి అనుమతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో తడుక అశోక్ గౌడ్, పెరుమాండ్ల కోటి, పృథ్వి రాజ్, వినయ్, ప్రమోద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.