ఏడు పంచాయతీలకు కేంద్రం అవార్డులు

by  |

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలోని ఏడు పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వ దీనదయాళ్ ఉపాధ్యాయ సాక్షాత్రీకరణ్ పురస్కార్ పథకం తరపున అవార్డులు లభించాయి. దేశం మొత్తం మీద 27 రాష్ట్రాల్లో 207 పంచాయితీలకు అవార్డులు ప్రకటించగా అందులో తెలంగాణకు చెందినవి ఏడు ఉన్నాయి. జిల్లా పంచాయతీ విభాగంలో నిజామాబాద్‌కు, మేజర్ పంచాయతీ విభాగంలో కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్(ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా పరిధి), నిజామాబాద్ జిల్లా పరిధిలోని నందిపేటలకు అవార్డులు లభించాయి. గ్రామ పంచాయతీ విభాగంగా కరీంనగర్ జిల్లా (ఇప్పుడు పెద్దపల్లి జిల్లా) కిష్టంపేట, సిద్దిపేట జిల్లా గుర్రాలగొంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గంగారం, సిద్దిపేట జిల్లా పెద్ద లింగారెడ్డిపల్లి పంచాయతీలకు అవార్డులు లభించాయి. ఈ అవార్డుల కింద లభించే నగదు పురస్కారాన్ని గతంలో అవార్డుల సందర్భంగా ఇచ్చిన నగదు వినియోగానికి సంబంధించిన పత్రాలను సమర్పించిన తర్వాత విడుదల చేయనున్నట్టు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సంజీబ్ పత్‌జోషి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Next Story