భారత్ పర్యటనను రద్దు చేసుకోండి : యూఎస్

by  |
Avoid India Travel
X

న్యూయార్క్ : భారత్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న వేళ అమెరికా ప్రభుత్వం ఆ దేశ పౌరులకు కీలక సూచన చేసింది. భారత్‌కు వెళ్లాలనుకునేవారు వారి పర్యటనను కొన్నాళ్ల పాటు రద్దు చేసుకోవాలని సూచించింది. ఒకవేళ భారత్‌కు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాత్రం.. వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకుని, తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. మాస్కు తప్పనిసరిగా పెట్టుకుంటూ.. ఆరడుగుల దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది.

ఈ మేరకు యూనైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటేషన్ (సీడీసీ) ఒక ప్రకటనలో పేర్కొంది. ‘భారత్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వ్యాక్సిన్ ఫుల్ డోస్ తీసుకున్నవాళ్లు కూడా కొవిడ్ బారిన పడే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో భారత్ పర్యటనను రద్దు చేసుకోవడం మంచిది’ అని సీడీసీ తెలిపింది. భారత్ లో కొవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్నదంటూ పేర్కొంది. బ్రిటన్ కూడా భారత్‌ను ‘రెడ్ లిస్ట్’ లో చేర్చిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed