- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడి

దిశ ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మానవ మృగాలు మారడం లేదు. చిన్నారులు, మహిళలపై అకృత్యాలకు ఒడిగడుతూ పశువాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో అభంశుభం తెలియని నాలుగేండ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పారిశ్రామిక ప్రాంతమైన సారపాక భాస్కర్‌నగర్ ఎస్టీ కాలనీలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎస్‌ఐ బమ్మెర బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… భాస్కర్‌నగర్ కాలనీలోని ఎస్టీ కాలనీకి చెందిన నాలుగేళ్ల చిన్నారి చాక్లెట్లు కొనుక్కునేందుకు ఇంటి సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. దుకాణ సమీపంలో నివాసం ఉండే ఆటోడ్రైవర్ పింగళి గణేశ్ అలియాస్ చింటూ.. చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇంటికి వెళ్లిన తరువాత చిన్నారి ఆ విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో స్థానికులతో కలిసి తల్లిదండ్రులు ఆ యువకుడి ఇంటికి వెళ్లి అతడిని చితకబాది పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.