ఏపీలో కరోనా విజృంభణ.. అధికారులు అలర్ట్

by  |
ఏపీలో కరోనా విజృంభణ.. అధికారులు అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు 100లోపు నమోదైన కేసులు ఇప్పుడు 1000 దాటుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో 1184 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి వల్ల నలుగురు మృత్యువాత పడ్డారు. ఇకపోతే గుంటూరులో 352, వైజాగ్‌లో 186 కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. ఆ తర్వాత చిత్తూరు, కృష్ణా జిల్లాలలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ కొవిడ్ నోడల్ ఆఫీసర్ డా.అర్జా శ్రీకాంత్ సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను ప్రజలు తప్పక పాటించాలని కోరారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం మరచిపోవద్దన్నారు. వీధిలో ఉన్న కరోనాని ఒంట్లోనికి, ఇంట్లోకి తెచ్చుకోవద్దని అర్జా శ్రీకాంత్ సూచించారు.

Next Story

Most Viewed