టీమిండియాను ‘కంగారు’ పెట్టిన ఆసీస్

by  |
టీమిండియాను ‘కంగారు’ పెట్టిన ఆసీస్
X

దిశ, వెబ్‌డెస్క్: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఆసీస్-ఇండియా మ్యాచ్‌లో కంగారులు పరుగుల వరద పారించారు. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేశారు. బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు ప్రయత్నించినప్పటికీ వారు విఫలమయ్యారు. దీంతో స్కోరు ఏకంగా 374 చేరింది. ఆసీస్‌లో ముఖ్యంగా స్టీవ్ స్మిత్(105) 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఓపెనింగ్‌లో వచ్చిన డేవిడ్ వార్నర్(69) పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇక మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఏకధాటిగా బ్యాటింగ్ చేసిన ఫించ్(114) పరుగులు చేశాడు. 124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు కొట్టి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీనికి తోడు ఐపీఎల్‌ మొత్తంలోనే పేలవ ప్రదర్శన చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ 19 బంతుల్లో 45 పరుగులతో రాణించాడు.

ఇక మిడిలార్డర్‌లో వచ్చిన మార్కస్ స్టోయినిస్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన మార్నస్(2) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో 331 పరుగుల వద్ద మార్నస్ వికెట్ కోల్పోవడంతో కంగారులు 5 వికెట్లను కోల్పోయింది. ఇక తొలి నుంచే మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్న స్మిత్ 105 పరుగులు చేసి 372 వద్ద షమీ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అలెక్స్ కారీ (17), పాట్ కమ్మిన్స్ 1 పరుగు చేసే సరికి నిర్ణీత ఓవర్లు ముగిశాయి. దీంతో కంగారులు నిర్ణీత ఓవర్లలో 374 పరుగుల భారీ స్కోర్‌ను టీమిండియా ముందు నిర్దేశించింది. ఇక 375 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదిస్తుందో లేదో చూడాల్సిందే.



Next Story

Most Viewed