ముచ్చటైన ప్రయాణ ప్రాంగణం

by  |
ముచ్చటైన ప్రయాణ ప్రాంగణం
X

దిశ, కొత్తపల్లి: మద్దూరు మహబూబ్ నగర్ ప్రధాన రోడ్డుపై ఆహ్లాదంగా కనిపిస్తున్న ప్రయాణికుల ప్రాంగణం. వివరాల్లోకి వెళితే మండలంలోని మారుమూల గ్రామం అయిన మన్నాపూర్ గ్రామ పంచాయతీ, ప్రధాన రోడ్డు నుండి గ్రామము రెండు కిలోమీటర్ల దూరం ఉంది. గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రయాణికుల అవసరాలను బట్టి బస్సు ప్రాంగణం నిర్మించారు. అట్టి ప్రాంగణము శిథిలావస్థకు చేరినందువల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గోవిందమ్మ పంచాయతీ నిధుల నుండి దాదాపు 70,000 రూపాయలు ఖర్చు చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రధాన రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు ఈ బస్ స్టాప్ ని చూసి అబ్బా ఎంత బాగుంది అని అనుకుంటున్నారు.

Next Story