కరోనాతో మృతి.. మృతురాలు కనిపించడం లేదు

by  |
కరోనాతో మృతి.. మృతురాలు కనిపించడం లేదు
X

దిశ ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో తెలిపే ఘటన ఒకటి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే… ఈ నెల 13న పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కూచుంపూడి గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను ఏలూరు ఆశ్రం కోవిడ్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు.

మూడు రోజుల క్రితం ఆమెను డిశ్చార్జ్ చేస్తున్నట్టు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు బంధువులు రాగా పొంతన లేని సమాధానాలు చెప్పి వారిని పంపేశారు. శనివారం మళ్లీ వచ్చిన ఆమె కుమారుడు అధికారులను నిలదీయడంతో ఆమె కనిపించడం లేదని తాపీగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రికార్డులన్నీ తీసి చూపించాలని డిమాండ్ చేయడంతో ఆమె మరణించిందని తేలింది. కనీసం ఆమె మృతదేహం చూపించాలన్నా కుదరదని తెగేసి చెప్పారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story