బీసీ సంఘం అధ్యక్షుడు పుల్లారావు పై దౌర్జన్యం.

81

దిశ,కల్లూరు: స్థానిక కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామంలో సండ్ర అనుచరులు కొందరు కల్లూరు మండలం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇంటి వద్దకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు .ఈ సంఘటనపై స్పందిస్తూ మండల అధ్యక్షులు లింగనబోయిన పుల్లారావు మాట్లాడుతూ మీ గుండా గిరికి దౌర్జన్యాలకు భయపడేది బీసీ సంఘం కాదు అని మీ అనుమతితో బీసీ సంఘం అధ్యక్షునిఎన్నుకోవాల్సిన దుస్థితిలో సంఘం లేదని ,సంవత్సరకాలంగా బీసీ సంఘం నేతగా ఎన్నో ఎ కార్యక్రమాలు చేశామని మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ లో ఎలాంటి పదవులు లేవని ఆ పదవుల పందేరం ఎలా జరిగిందో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సత్యం, శ్రీను, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..