5 ట్రయల్ సైట్లను సిద్ధం చేసిన కేంద్రం

by  |
5 ట్రయల్ సైట్లను సిద్ధం చేసిన కేంద్రం
X

న్యూఢిల్లీ: ఫైనల్ ఫేజ్ హ్యూమన్ ట్రయల్స్ కోసం కనీసం ఐదు సైట్లను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, జైదుస్ కాడిలా, భారత్ బయోటెక్‌లు అభివృద్ధి చేస్తున్న టీకాల ట్రయల్స్ కోసం సైట్లను సిద్ధం చేసే పనిలో భారత్ బయోటెక్ శాఖ(డీబీటీ) తలమునకలైంది. నాలుగు రాష్ట్రాల నుంచి కనీసం ఐదు సైట్లను సిద్ధం చేసింది. హెల్తీ పార్టిసిపెంట్లను సిద్ధంగా ఉంచడానికి అదనంగా మరో ఆరు సైట్లను ఏర్పాటు చేస్తున్నది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో టీకా ట్రయల్స్‌లో జాప్యాన్ని నిరోధించడానికే ఈ ప్రయత్నాలని డీబీటీ తెలిపింది.

వేలాది మంది పార్టిసిపెంట్లు, ఆరోగ్య నిపుణులు, ముందస్తు షరతలు ఇలా అనేకం ట్రయల్స్ కంటే ముందు కంపెనీలకు అవసరమవుతాయని, వాటిని సంసిద్ధంగా ఉంచాలని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు డీబీటీ సెక్రెటరీ డాక్టర్ రేణు స్వరూప్ తెలిపారు. ఈ సైట్లలో ఏ గ్రూప్ అయినా థర్డ్ ఫేజ్ ట్రయల్స్ నిర్వహించుకోవచ్చునని, ఏ కంపెనీ టీకాతో సంబంధం లేకుండా అందరూ ఈ సైట్లలో ట్రయల్స్ నిర్వహించుకోవచ్చునని, ట్రయల్స్ సదుపాయాన్ని కల్పించడమే తమ ఉద్దేశమని వివరించారు. ప్రస్తుతం హర్యానాలోని ఇంక్లెన్ ట్రస్ట్ ఇంటర్నేషనల్, పూణెలోని కేఈఎం, హైదరాబాద్‌లోని సొసైటీ ఫర్ హెల్త్ అలాయిడ్ రీసెర్చ్, చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ, తమిళనాడు వెళ్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ సైట్లు సిద్ధంగా ఉన్నాయి.

Next Story

Most Viewed