బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబుల్.. 90 మంది మృతి

by  |
Kabul Blasts
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్గనిస్తాన్ లో ఖోరాస‌న్ ఐఎస్ఎస్ ఖోరాస‌న్ తీవ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. వరుస పేలుళ్ల‌తో కాబూల్ ఎయిర్ పోర్ట్ దద్దరిల్లింది. ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లలో 90 మందికి పైగా మృతి చెందారు. 120 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో సాధార‌ణ పౌరులు 60 మంది ఉండ‌గా, 12 మంది అమెరికా సైనికులు, మ‌హిళ‌లు, చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఈ దాడులు చేసింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఈ దాడుల్లో 12 మంది అమెరికా సైనికులు మరణించడంతో ప్రతీకారం తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఈ పేలుళ్లు జ‌ర‌గ‌డానికి కొన్ని గంట‌ల ముందు కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 160 మంది భార‌తీయుల‌ను ఇండియాకు తీసుకొచ్చారు. 160 మందిలో 145 మంది ఆఫ్గనిస్తాన్ సిక్కులు ఉండగా, 15 మంది హిందువులు ఉన్నారు. ఇప్పటికీ ఆఫ్గనిస్తాన్‌లో వేలాది మంది భార‌తీయులు ఉన్నట్టు స‌మాచారం. వారందరినీ సుర‌క్షితంగా ఇండియాకు తీసుకొస్తామ‌ని భార‌త‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రక‌టించింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద వ‌ర‌స పేలుళ్ల త‌రువాత, అక్కడ ప‌రిస్థితులు దారుణంగా మారిపోవ‌డంతో భార‌తీయుల‌ను ఎలా త‌ర‌లిస్తారు అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story

Most Viewed