బ్రేకింగ్ న్యూస్.. భగ్గుమన్న పాత కక్షలు.. ఆ టీఆర్ఎస్ నేత హత్య..

82
Murder11

దిశ, మల్లాపూర్: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్వగ్రామం రాఘవపేట్ లో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మామిడి లక్ష్మయ్య (47) అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. అదే గ్రామానికి చెందిన దాసరి వినోద్ అనే వ్యక్తి పాత కక్షలతో లక్ష్మయ్యను హత్య చేశాడని స్థానికులు తెలిపారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

నిన్న యామాపూర్..

జగిత్యాల జిల్లాలో వరసగా రెండు హత్యలు జరిగాయి. రెండు రోజుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులే హత్యకు గురి కావడం కలకలం సృష్టిస్తోంది. గురువారం రాత్రి ఇబ్రహీంపట్నం పట్నం మండలం యామాపూర్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు రాజేందర్ దారుణ హత్యకు గురయ్యాడు. 24 గంటల్లోనే మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామ శాఖ అధ్యక్షుడు లక్ష్మయ్య అలియాస్ ఎర్రన్న హతం కావడం గమనార్హం. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన వారే కావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.