ఏషియన్ పెయింట్స్ త్రైమాసిక లాభం రూ. 452 కోట్లు!

by  |
ఏషియన్ పెయింట్స్ త్రైమాసిక లాభం రూ. 452 కోట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి మార్చితో ముగిసిన త్రైమాసికంలో ప్రముఖ పెయింట్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ నికర లాభాలను రూ. 452.09 కోట్లుగా నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 5.44 శాతం క్షీణించినట్టు పేయింట్ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. చివరి త్రైమాసికంలో అమ్మకాలు 8.41 శాతం తగ్గి రూ. 3,879.01 కోట్లుగా ఉన్నట్టు, అంతకుముందు ఇదే త్రైమాసికంలో రూ. 4235.32 కోట్లని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 24.47 శాతం పెరిగి రూ. 2,653.95 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 2,132.17 కోట్లుగా ఉంది. అమ్మకాలు 4.89 శాతం పెరిగి రూ. 17,194.09 కోట్లని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 16,391.78 కోట్లని కంపెనీ వెల్లడించింది.

బెర్గర్ పెయింట్స్ ఇండియా నికర లాభం రూ. 194.65 కోట్లు..

మరో ప్రముఖ పెయింట్ కంపెనీ బెర్గర్ పెయింట్స్ ఇండియా 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నికర లాభం 125.37 శాతం పెరిగి రూ. 194.65 కోట్లుగా వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 86.37 కోట్లని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇక, అమ్మకాలు 13.15 శాతం క్షీణించి రూ. 1,174.82 కోట్లకు చేరుకున్నాయి. మునుపటి త్రైమాసికంలో అమ్మకాలు రూ. 1352.73 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 60.39 శాత పెరిగి రూ. 699.05 కోట్లకు చేరుకుందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 435.84 కోట్లని తెలిపింది. అమ్మకాలు ఇంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 5,515.55 కోట్లు నమోదవగా, ఈసారి 3.19 శాతం పెరిగి రూ. 5,691.69 కోట్ల కంపెనీ ప్రకటించింది.

Next Story