‘ప్రగతి భవన్ ముట్టడి లేకున్నా అరెస్ట్’

114
bjp leaders arrest

దిశ, చేవెళ్ల : చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య షాబాద్ మండల అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చారో స్పష్టం చేయాలని, లేనట్లయితే షాబాద్ మండలం బంద్ ప్రకటిస్తామని మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం షాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మాణెయ్య, మండల ఉపాధ్యక్షుడు రవి చారి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు బక్క శ్రీశైలం, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గోవర్ధన్, ముదిరాజ్ సెల్ కన్వీనర్ జనార్ధన్ తదితరులు మాట్లాడుతూ.. షాబాద్ మండలానికి ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చాడో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మించిన భవనాన్ని కరోనా కష్టకాలంలో కూడా ప్రారంభించలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య పర్యటన సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులను అర్ధరాత్రి చేసిన అక్రమ అరెస్టులను బీజేపీ నాయకులు ఖండించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..