గుప్త నిధుల కోసం పూజ‌లు..న‌లుగురి అరెస్టు

by  |

దిశ‌, ఖ‌మ్మం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కారు కొండగుట్ట వద్ద శుక్ర‌వారం అర్ధరాత్రి స‌మ‌యంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జ‌రిపేందుకు య‌త్నించిన‌ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా కొత్త‌గూడెం ప‌ట్ట‌ణంలోని మేదరబస్తీకి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శుక్రవారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో వింత శ‌బ్దాల‌తో పూజ‌లు చేస్తున్న కొంత‌మందిని గుర్తించిన స్థానికులు 100కు డ‌య‌ల్‌ చేశారు. వెంట‌నే అక్క‌డికి చేరుకున్నపోలీసులు న‌లుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

Tags: Bhadradri Kottagudem, police, 4people, Arrest

Next Story

Most Viewed