ఎర్రవల్లిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల ఎంట్రీతో షాక్‌లో పోలీసులు (వీడియో)

by  |
ఎర్రవల్లిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల ఎంట్రీతో షాక్‌లో పోలీసులు (వీడియో)
X

దిశ, గజ్వేల్ : సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో రచ్చబండ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ సహ అగ్ర నాయకత్వం హజరు కానుందని పార్టీ శ్రేణులు భారీగా హజరు కావాలంటూ పిలుపునిచ్చిన విషయం విధితమే. ఇదిలా ఉండగా రచ్చబండ కార్యక్రమానికి అనుమతులు లేవంటూ పోలీసులు.. కాంగ్రెస్ నాయకులను అక్కడికక్కడే అరెస్ట్‌ చేశారు. ఎర్రవల్లి చుట్టూ 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులు మొదలుకోని చిన్న రహదారులను సైతం వదలకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన విషయం విధితమే.

కాగా, ముందుగా అనుకున్న ప్రకారమే గజ్వేల్ మాజీ ఎమ్మేల్యే తూంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు తూంకుంట ఆకాంక్ష రెడ్డిల నేతృత్వంలో నాయకులు నాయిని యాదగిరి, భాను ప్రకాష్‌లతో పాటు సీనియర్ నాయకులు, 200 మంది హస్తం శ్రేణులు పొలాల గుండా చాకచక్యంగా ఎర్రవల్లి గ్రామంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. రహదారుల దిగ్భంధనతో అంతా సైలెంట్‌గా ఉందని భావించిన పోలీసులకు కాంగ్రెస్ నేతల ఎంట్రీతో సీన్ రసవత్తరంగా మారింది. ఒక్క సారిగా 200 మంది నాయకులు తరలిరావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

వీరిని గమనించి అప్రమత్తమైన ఏసీపీ రమేష్.. పోలీసు బలగాలతో వీరిని అడ్డుకోని వాహనాల్లో దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసీఆర్, పోలీసులు డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. వీరి అనూహ్య రాకతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Next Story

Most Viewed