నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..?

by  |
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..?
X

దిశ, వెబ్‎డెస్క్: ఎక్కువగా నిద్రను ప్రేమించినా, నిద్ర పట్టకపోయినా రెండూ ఆరోగ్యానికి మంచిది కాదు. సరైన ఆరోగ్యం లేనప్పుడే నిద్ర సమస్యలు వస్తాయి. నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పని ఒత్తిడి వల్లనో, మారుతున్న జీవన ప్రమాణాల వల్ల సరిగా నిద్ర రాక కొంతమంది బాధపడుతుంటారు.ప్రశాంతంగా ఎలా నిద్రపోవాలి, నిద్రలేమి నుంచి ఎలా దూరమవ్వాలి అనే విషయాలు గురించి తెలుసుకుందాం.

కొంతమందికి తొందరగా నిద్ర పడుతోంది. మరికొంతమందికి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా స్పందించడం వంటి కారణాలు కూడా నిద్రకు దూరం చేస్తాయి. సరిగ్గా నిద్రపట్టని రోజు చిరాకు, ఒత్తిడికి గురవుతుంటారు. నిద్రలేమి ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుంది. నిద్రలేమితో మధుమేహం, ఊబకాయం, మెదడు పనితీరుపై ప్రభావం పడగా.. గుండెకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కంటినిండా నిద్రపోవడంవల్ల ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతోంది.

నిద్రలేమి సమస్యతో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని.. దీంతో తొందరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. ఏడు గంటలకన్నా తక్కువగా నిద్రపోయే వారికి జలుబు త్వరగా వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. నిద్రలేమి వల్ల మలబద్దకం, డిప్రెషన్, కోపం, చిరాకు ఎక్కువవుతాయి. ఇది చివరికి ఎనిమీయాకు దారి తీస్తుంది.

ఈ సమస్యకు సమయానికి భోజనం చేయడం, యోగా, వాకింగ్, సైక్లింగ్ వంటివి చేయడంతో పాటు ఎనిమిది గంటలపాటు కూడా నిద్రపోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు, చిన్న పిల్లలు 11 గంటలు, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు. మనిషి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ధూమపానం, మద్యాపానం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.



Next Story

Most Viewed