ఏప్రిల్‌లో భారీగా తగ్గిన ఇంధన వినియోగం!

by  |
ఏప్రిల్‌లో భారీగా తగ్గిన ఇంధన వినియోగం!
X

దేశంలో లాక్‌డౌన్ నిరవధికంగా కోన్సాగుతోంది. సోమవారం నుంచి కొంత సడలింపు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో బయట తిరగడానికి అనుమతుల్లేవ్. దేశవ్యాప్తంగా ప్రయాణాలు, రవానా ఆగిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎల్‌పీజీ మినహాయించి ఇంధర ఉత్పత్తులకు డిమాండ్ భారీస్థాయిలో దిజగారింది. దీంతో ఏప్రిల్ నెలలో ఇంధన వినియోగం ఏకంగా 70 శాతం పడిపోయింది. ఏప్రిల్ చివర్లో పట్టణ, మునిసిపాలిటీ పరిధుల్లో ఆర్థిక కార్యకలాపాలకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడం డిమాండ్ కొద్దిగా పెరిగింది. ఇక, సోమవారం నుంచి మరిన్ని అంశాల్లో సడలింపులు ఇవ్వడంతో మే నెల నుంచి ఇంధనానికి మరింత డిమాండ్ పెరుగుతుందనే అవకాశముందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సదరు పరిశ్రమల అందజేసిన గణాంకాలు ప్రకారం..ఏప్రిల్ మొదటి 15 రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థల పెట్రో అమ్మకాలు 64 శాతం క్షీణించగా, చివరి 15 రోజుల్లో 61 శాతం దిగజారింది. డీజిల్ అమ్మకాలు సైతం మొదటి సగం 61 శాతం, రెండో సగం 56.5 శాతం విక్యం తగ్గినట్టు తెలుస్తోంది.

Tags: April Petrol Sales, Diesel, Petrol, Indian Oil Corp, Hindustan Petroleum Corp, Bharat Petroleum

Next Story

Most Viewed