Babu Jagjivan Ram: 1908 ఏప్రిల్ 5.. 'సమానత్వ దినోత్సవం'

by Manoj |
Babu Jagjivan Ram: 1908 ఏప్రిల్ 5.. సమానత్వ దినోత్సవం
X

దిశ, ఫీచర్స్ : భారత స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త 'బాబూ జగ్జీవన్ రాం' 1908 ఏప్రిల్ 5న జన్మించాడు. బిహార్‌లోని వెనుకబడిన వర్గానికి చెందిన ఆయన బాబూజీగా ప్రసిద్ధి. భారత పార్లమెంటులో దశాబ్దాల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాక ఉపప్రధానిగానూ వ్యవహరించాడు.

1935లో అంటరానివారికి సమానత్వం కల్పించేందుకు 'ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్' సంస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన బాబూజీ.. ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నడిపాడు. ఇదే క్రమంలో 'అఖిల భారత అణగారిన వర్గాల కూటమి' స్థాపనకు సహకరిస్తూనే 1935 హిందూ మహాసభ సెషన్‌లో దేవాలయాలు, తాగునీటి బావుల వద్ద దళితులకు ప్రవేశం కల్పించాలనే తీర్మానాన్ని ప్రతిపాదించాడు. ఇక 1936 నుంచి 1986 వరకుపార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు సాధించాడు. అతని జయంతిని భారతదేశంలో తన్మయి(సమానత్వ దినోత్సవం)గా నిర్వహిస్తుండగా.. భారత ప్రభుత్వం అతని సిద్ధాంతాల ప్రచారం కోసం ఢిల్లీలో 'బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్' ఏర్పాటు చేసింది.

Next Story

Most Viewed