నోడల్ ఆఫీసర్ల నియామకం.. ఎంఈఓలపై తగ్గనున్న భారం..

by  |
నోడల్ ఆఫీసర్ల నియామకం.. ఎంఈఓలపై తగ్గనున్న భారం..
X

దిశ, ఖానాపూర్ : నర్సంపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల పూర్తి పర్యవేక్షణకై నోడల్ ఆఫీసర్లలను నియమించారు. అనుభవజ్ఞులైన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల్ని గుర్తించి వారికి బాధ్యతలు అప్పజెప్పారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండల విద్యాశాఖ కార్యాలయాల్లో విద్యాధికారుల భర్తీ చేపట్టాల్సి ఉంది. కానీ కోర్టు కేసుల కారణంగా గత కొన్నేళ్లుగా భర్తీ ప్రక్రియ పెండింగ్ లోనే ఉంది. ఈ కారణంగా విద్యా శాఖలో ఒక్కో ఎంఈఓ సుమారుగా నాలుగు మండలాలకు ఇంచార్జీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యాశాఖలో క్షేత్ర స్థాయి పర్యవేక్షణ కరువైంది.

ఈ నేపథ్యంలో నోడల్ ఆఫీసర్ల నియామకం అనివార్యమైంది. జడ్పీహెచ్ఎస్ ఖానాపూర్ పాఠశాలలో పని చేస్తోన్న దూలం రాజేందర్ ని ఖానాపూర్ మండల నోడల్ అధికారిగా, జడ్పీహెచ్ఎస్ లక్నేపల్లికి చెందిన వి. మురళి ని నర్సంపేట మండలానికి, జడ్పీహెచ్ఎస్ మచ్చపూర్ కి చెందిన ఎం.ఏ రాజాక్ ని గీసుగొండ మండల నోడల్ ఆఫీసర్లుగా శుక్రవారం బాధ్యతలని అప్పగించారు. వీరు క్షేత్ర స్థాయిలో అకాడమిక్ సంబంధించిన అన్ని వ్యవహారాలను సంబంధిత మండలాల్లో పర్యవేక్షిస్తారు.


Next Story

Most Viewed