యాపిల్ ఐఓఎస్‌ 15 నేడు మార్కెట్లోకి విడుదల

by  |
యాపిల్ ఐఓఎస్‌ 15 నేడు మార్కెట్లోకి విడుదల
X

దిశ, వెబ్​డెస్క్​: ప్రముఖ యాపిల్ మొబైల్ ​తయారీ సంస్థ తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది. మార్కెట్లోకి యాపిల్​ ఐఓఎస్‌ 15ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సోమవారం రాత్రి 10:30 నుంచి యూజర్స్ తమ డివైజ్‌లలో ఈ కొత్త ఐఓఎస్‌ అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఐఫోన్లలో ఉన్న ఐఓఎస్‌ 14.8 ఓఎస్‌ స్థానంలో ఈ కొత్త ఐఓఎస్‌ 15 ని డౌన్‌లోడ్ చేసుకోవాలని ఐఫోన్, ఐపాడ్ యూజర్లకి యూపిల్ సంస్థ సూచనలు చేసింది. గత వాటితో పోలిస్తే ఐఓఎస్‌ 15 సరికొత్త యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో రానున్నట్లు టెక్‌ వర్గాలు తెలిపాయి. ఐఓఎస్​ 15.. ఐఫోన్ 13 సిరీస్‌, ఐఫోన్ 12 , ఐఫోన్ 11 సిరీస్‌, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌, ఐఫోన్ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్ ఎక్స్‌, ఐఫోన్ 8 సిరీస్‌, ఐఫోన్ 7 సిరీస్‌, ఐఫోన్ 6ఎస్‌ సిరీస్‌, ఐఫోన్ ఎస్‌ఈ 1, 2 , ఐపాడ్ టచ్‌ 7 డివైజ్‌లను సపోర్ట్ చేస్తుందని యాపిల్ కంపెనీ తెలిపింది.

ఐఓఎస్‌ 15 లో ఏఏ ఫీచర్స్​ ఉంటాయి…

* యాపిల్ నూతనంగా తీసుకొస్తున్న దీంట్లో ఫేస్‌టైమ్‌ ఫీచర్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్, పీసీ యూజర్స్‌ కూడా పాల్గొనవచ్చు. ఇతరుల నుంచి వచ్చే ఐ మెసేజెస్‌లోని లింక్‌లు, ఫొటోలను సులువుగా ట్రాక్ చేయొచ్చు.
* యూజర్స్‌ నోట్స్‌కి ట్యాగ్‌ని యాడ్‌ చేసుకోవచ్చు. ఇందులోని స్మార్ట్‌ ఫోల్డర్స్ ఫీచర్ ట్యాగ్‌ల ఆధారంగా నోట్స్ అన్నింటినీ ఒక చోట చూపిస్తుంది. దాంతో యూజర్ సులువుగా తనకు కావాల్సిన నోట్స్‌ని యాక్సెస్‌ చేయొచ్చు.
* మ్యూట్ బటన్‌ టచ్‌ చేసిన ప్రతిసారీ మీకు అలర్ట్స్ సౌండ్ వినిపిస్తుంది. దీనివల్ల యూజర్స్ ట్రాకింగ్ పిక్సెల్స్‌ని బ్లాక్ చేయగలరు. బిజినెస్​కు సంబంధించిన ఈ-మెయిల్స్‌ ఓపెన్ చేసినప్పుడు వాటిని ఎప్పుడు ఓపెన్ చేశారు.. ఎంతసేపు ఉంచారనేది మార్కెటింగ్‌ కంపెనీలు పిక్సెల్‌ సాయంతో ట్రాక్ చేస్తాయి. దానివల్ల కొన్నిసార్లు యూజర్‌ డేటా కూడా ఆ కంపెనీలకు చేరిపోయే అవకాశం ఉంది.
* ఫీచర్ ఫోకస్‌, దీని సాయంతో యూజర్స్ తమ నోటిఫికేషన్‌ ప్రాధాన్యతలను కనిపించేలా మార్పులు చేయొచ్చు. అలానే మీ ప్రస్తుత పరిస్థితి ఆధారంగా ఫోన్‌ వైబ్రేట్ కావాలా, సౌండ్ చేయాలా.. వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. ‌‌
* ఐఓఎస్‌ 15లో యాపిల్‌ మ్యాప్స్‌తో యూజర్స్ దారి తెలుసుకోవడంతోపాటు ఒక ప్రదేశానికి బయల్దేరిన, చేరిన సమయాన్ని కూడా తెలుసుకోవచ్చు.
* సుమారు 100కు పైగా కొత్త ఎమోజీలను ఐఓఎస్‌ 15లో పరిచయం చేయనున్నారు.
* కొత్త అప్‌డేట్ చేసేప్పుడు అపరిమిత క్లౌడ్ స్టోరేజ్‌ని యూజర్స్ యాక్సెస్‌ చేయొచ్చు. మీరు కొత్త డివైజ్‌ కొనుగోలు చేసినా లేదా మీ డేటా బదిలీ చేయాలనుకున్నప్పుడు అపరిమిత క్లౌడ్ స్టోరేజ్‌ని పొందొచ్చు. అయితే దీనిపై ఎలాంటి పరిమితులు ఉంటాయనేది ఇంకా తెలియాల్సివుంది.
* యూజర్స్ ఫొటోలపైన ఉండే టెక్ట్స్‌ని డైరెక్టుగా కాపీ, పేస్ట్, షేర్‌ చేసుకోవచ్చు.
* కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌లో థెఫ్ట్‌ ప్రొటెక్షన్ ఫీచర్‌ ఉంది. ఫోన్‌ పోయినా, దొంగిలించినా, అందులోని సమాచారం తొలగించినా యూజర్‌ ఫోన్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించవచ్చు. దానిని ఎవరైనా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే అందులో ‘ది హలో స్క్రీన్‌’ అనే ఫీచర్‌ డివైజ్‌ లాక్‌ అయ్యి, అది ఇంకోకరిదనే విషయాన్ని తెలియజేస్తుంది.



Next Story

Most Viewed