నాకు నోటీసులిచ్చే అధికారం ప్రివిలేజ్ కమిటీకి లేదు : నిమ్మగడ్డ

by  |
nimmagadda
X

దిశ, వెబ్ డెస్క్: ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసులపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. తాను ఎక్కడా శాసన సభ్యుల హక్కులకు భంగం కలిగించలేదని వివరణలో తెలిపారు. ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి ఎస్ఈసీ రాదని స్పష్టం చేశారు. తనకు నోటీసులు జారీ చేసే అధికారం ప్రివిలేజ్ కమిటీకి లేదంటూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. తనపై చేసిన ఆరోపణలుకు ఆధారాలు చూపించాలని కోరారు. తనకు శాసన సభ, శాసన సభ్యులు అంటే ఎంతో గౌరవం అని తెలిపారు. అలాంటిది తాను సభ్యుల హక్కులకు భంగం కల్పించారనడంలో వాస్తవం లేదన్నారు. దీనిపై ఇంకా ముందుకు వెళ్లాలనుకుంటే ఆధారాలతో సహా వస్తానని తెలిపారు. సరైన సమయంలో ఆధారాలతో స్పందిస్తానన్నారు. ప్రస్తుతం తాను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించారు. అందువల్ల ప్రయాణాలు చేయలేనని అలాగే విచారణకు కూడా హాజరు కాలేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed