నా క్యారెక్టర్ ప్రజలకు తెలుసు

by  |
నా క్యారెక్టర్ ప్రజలకు తెలుసు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో మంత్రి స్టికర్‌‌తో వాహనంలో పట్టుబడ్డ నగదుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ మంత్రి బాలినేని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నా క్యారెక్టర్ ప్రజలకు తెలుసని, 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చలేదన్నారు. డబ్బు పట్టుబడిన విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఆ డబ్బు నాదని తెలితే రాజీనామా చేస్తానని అన్నారు. కావాలనే టీడీపీ నేతలు అబాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. బోండా ఉమాకు నాపై ఆరోపణలు చేయడానికి సిగ్గుండాలని, లోకేశ్‌కు నన్ను విమర్శించే అర్హత లేదన్నారు. సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. నేను తలచుకుంటే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానని ఫైర్ అయ్యారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed