వలస కూలీలకు ప్రత్యేక క్వారంటైన్లు!

by  |
వలస కూలీలకు ప్రత్యేక క్వారంటైన్లు!
X

దిశ, అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికోసం ప్రత్యేకంగా 9 రైళ్లు అందుబాటులో ఉన్నట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీల కోసం ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన..రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయంలోనూ పది నుని పదిహేను బెడ్స్ సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర మొత్తంగా లక్ష బెడ్లను రెడీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇంటికి ఒకరికి మాత్రమే పాస్ ఇవ్వనున్నారు. అలాగే, మందులను టెలీమెడిసిన్ ద్వారా సరఫరా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది. దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా పరీక్షలు చేస్తోంది ఏపీ రాష్ట్రమే. పది లక్షలకు 2,152 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు, ఇప్పటిదాకా కరోనా నుంచి 488 మంది కోలుకుని డిస్చార్జ్ అయినట్టు మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

Tags: amaravati, coronavirus, quarantine centers, Ap, minister alla nani

Next Story

Most Viewed