ఏపీలో షట్‌డౌన్ రూల్స్ ఇవే..!

by  |
ఏపీలో షట్‌డౌన్ రూల్స్ ఇవే..!
X

జనతా కర్ఫ్యూ చప్పట్లతోనే ముగిసిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షట్‌డౌన్ విధించింది. తొలి రోజు కష్టంగా గడిపిన ఆంధ్రులు మలి రోజుకు మాత్రం ఒళ్లు విరుచుకుని రోడ్ల మీదకి వచ్చేశారు. సీఎం అత్యవసర పరస్థితుల్లో ఒక్కరు విధానాన్ని చూపి అందరూ రోడ్లమీదకి వచ్చేశారు. పరిస్థితి తీవ్రతను తెలిపేందుకు లాక్‌డౌన్ అన్నప్పటికీ సాధారణ పరిస్థితులే కనిపించాయి.

దీంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యక్తను ప్రజలే గుర్తుచేశారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం లాక్‌డౌన్ కాలంలో ప్రజల ఆహార, విహారాలపై నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అంటే కేవలం మూడు గంటల వ్యవధిలో మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చింది.

ఆ కొనుగోళ్లకు కూడా కుటుంబం నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాల్సి ఉంటుంది. అలా బయటికి వచ్చిన వ్యక్తి ఇంటికి మూడు కిలోమీటర్ల రేడియస్‌లో మాత్రమే అనుసరిస్తారు. అంతకంటే దూరం వెళ్లినా, విహారానికి వచ్చినట్టు అనుమానం వచ్చినా వారి వాహనాన్ని సీజ్ చేస్తారు. కర్ఫ్యూ కాలం ముగిసిన తరువాత వారికి ఇస్తారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కంప్లీట్ షట్ డౌన్… ఈ సమయంలో ఎవరూ బయటకు వెళ్లకూడదు.

పలువుర్ని దృష్టిలో పెట్టుకుని హోటళ్లకు వెసులుబాటు కల్పించింది. హోటళ్లు పార్సిల్ సర్వీసును నిర్వహించవచ్చు. ఆ పార్సిళ్లు కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. వాటిని తీసుకెళ్లేందుకు ఒక్కరికే అనుమతి. ఈ సమయంలో ఎదుటి వారితో కనీసం మూడు అడుగుల దూరం పాటించాల్సి ఉంటుంది.

Tags: ap lock down rules, andhrapradesh, governament, corona, covid-19,


Next Story