లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు తిరస్కరించిన హైకోర్ట్

by  |
లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు తిరస్కరించిన హైకోర్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్ట్ మరికొద్దిసేపట్లో విచారించనుంది. ప్రభుత్వం తో పాటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు సైతం పిటిషన్లు దాఖలు చేయడంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహిస్తే సుమారు 3లక్షల 60వేల మంది తమ ఓటుహక్కును కోల్పోతారంటూ గుంటూరు జిల్లాకు చెందిన కాలేజీ విద్యార్ధిని ధూళి పాళ్ల అఖిల హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టడం కుదరదని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చారని, ఈ సమయంలో తాము ఏమి చేయలేమని హైర్ట్ తెలిపింది. మరి ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో సుప్రీం కోర్ట్ లో తీర్పు రాష్ట్రప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా లేదా అన్నది అనుమానాలు తలెత్తుతున్నాయి.

Next Story