వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

by  |
వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
X

అమరావతి: ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, విడదల రజనీ, మధుసూదన్ రెడ్డి, సంజీవయ్య, వెంకట‌గౌడ్‌లకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి సదరు ఎమ్మెల్యేలే కారణమంటూ న్యాయవాది ఇంద్రనీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన కోర్టు.. సదరు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించింది.
కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేలు, వారి వెంట ఉన్న నాయకులు సామాజిక దూరం పాటించకుండానే నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపించిన విషయం తెలిసిందే.

Tags: ycp MLAs, high court, notice, social distence, ap

Next Story

Most Viewed