అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు.. ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ విడుదల

by  |
Joint Academic Calendar
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలను అక్టోబర్ 1 నుంచి పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే నవంబర్ 1 నుంచి పీజీ కోర్సులకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉమ్మడి అకడమిక్‌ క్యాలెండర్‌ను ఖరారు చేసింది. వారానికి 6 రోజులు తరగతులు జరగనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు రోజుల్లో ఏదో ఒకరోజు తరగతులు జరగకపోతే వాటిని రెండో శనివారం, ఆదివారం లేదా ఇతర సెలవు దినాల్లో నిర్వహించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కొవిడ్‌ దృష్ట్యా సరి, బేసి విధానంలో అకడమిక్‌ క్యాలెండర్‌ను ఖరారు చేశారు. కొవిడ్‌కు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.

నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల క్యాలెండర్‌
1, 3, 5 సెమిస్టర్ల తరగతులు అక్టోబర్‌ 1నుంచి ప్రారంభం కానున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. అలాగే ఈ తరగతులకు ఇంటర్నల్‌ పరీక్షలు డిసెంబర్‌ 1 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2022 జనవరి 22న తరగతుల ముగింపు ఉంటుంది. సెమిస్టర్‌ పరీక్షలను 2022 జనవరి 24 నుంచి ప్రారంభించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఇక సరి సెమిస్టర్ల విషయానికి వస్తే 2, 4, 6 సెమిస్టర్ల తరగతులను 2022 ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించనున్నారు. ఏప్రిల్‌ 4 నుంచి 9వ తేదీ వరకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 2022 మే 28వ తేదీతో తరగతులు ముగియనున్నాయి. 2022 జూన్‌ 1 నుంచి 2, 4, 6 సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతాయి. 2వ సెమిస్టర్‌ పరీక్షల అనంతరం 8 వారాల పాటు కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టు ఉంటుంది. 4వ సెమిస్టర్‌ తరువాత 8 వారాల పాటు సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. తదుపరి విద్యా సంవత్సరం 2022 ఆగస్టు 9నుంచి ప్రారంభం కానుంది.

నవంబర్ 1 నుంచి పీజీ తరగతులు
పీజీ కోర్సులకు నవంబరు 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 1, 3, 5 సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. 2,4,6 సెమిస్టర్ తరగతులు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ముగింపు పరీక్షలను జూలై 4వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Next Story

Most Viewed