AP News: హైకోర్టులో విద్యాదీవెనకు చుక్కెదురు.. రివ్యూకి వెళ్తామంటున్న ప్రభుత్వం

by  |
AP News: హైకోర్టులో విద్యాదీవెనకు చుక్కెదురు.. రివ్యూకి వెళ్తామంటున్న ప్రభుత్వం
X

దిశ, ఏపీ బ్యూరో: జగనన్న విద్యా దీవెన పథకంపై హైకోర్టు వెల్లడించిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. పారదర్శకత కోసమే తల్లుల ఖాతాలో నగదు జమ చేసే విధానాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జగనన్న విద్యాదీవెన పేరుతో తల్లుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నగదును తల్లుల ఖాతాల్లోకి కాకుండా నేరుగా కాలేజీ ప్రిన్సిపల్ ఖాతాల్లో జమ చేయాలంటూ ఇటీవల హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ వేయాలని సీఎం జగన్ సూచించారని మీడియాకు తెలిపారు.

ఈ పథకం గతంలో మాదిరి అమలు చేసేలా తాజా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరతామని.. అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ధర్మాసనానికి అందజేస్తామన్నారు. మరోవైపు ఇంటర్ ప్రవేశాలకు ఆన్‌లైన్ విధానం వద్దంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంపైనా మంత్రి స్పందించారు. హైకోర్టు తీర్పునకు సంబంధించిన ఆదేశాలు తమకు ఇంకా అందలేదని.. అందిన తర్వాత స్పందిస్తామని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed