జగనన్న కాలనీల నిర్మాణానికి అనుమతులు జారీ

by  |
జగనన్న కాలనీల నిర్మాణానికి అనుమతులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: పేదలందరికీ ఇండ్లు పథకంపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీలో 28.30 లక్షల ఇండ్ల నిర్మాణం కోసం గృహ నిర్మాణ శాఖకు అనుమతులు జారీ చేసింది. మొదటి దశలో 15.10 లక్షల ఇండ్లు, రెండో విడతలో 13.20 లక్షల ఇండ్ల నిర్మాణం చేయనున్నారు.

దీని కోసం రూ.24,776 కోట్లను ఖర్చు చేసేందుకు పాలనా అనుమతులు జారీ చేసింది. ఇండ్ల పట్టాలతో పాటు సొంతభూమి కలిగిన వారికీ ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ, లబ్ది దారులకు ఇండ్ల నిర్మాణం చేసి ఇవ్వనున్నారు. ప్రతీ ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా ఇవ్వనున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇండ్ల నిర్మాణ సంస్థను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇండ్ల నిర్మాణం కోసం రూ.920 కోట్లు కేటాయించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed