కరోనా మృతుల అంత్యక్రియలకు ఆర్థికసాయం

by  |
కరోనా మృతుల అంత్యక్రియలకు ఆర్థికసాయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా కేసులు రోజూ రెండు వేలకు చేరువలో కేసులు నమోదు అవుతున్నాయి. అంతేగాకుండా వైరస్ కారణంగా రోజూ అనేక మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆర్థిక సాయం ప్రకటించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కోవిడ్‌ కారణంగా మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా.. వారి కోసం రూ.15వేల చొప్పున ఇవ్వాలని సీఎం వైఎస్ నిర్ణయించారు. ఈ మేరకు తక్షణం చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారుల‌ను సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను కొన్ని చోట్ల కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పలు చోట్ల మున్సిపల్ సిబ్బంది సైతం అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. గుంతలు తీసి.. జేసీబీల సాయంతో అందులో విసిరేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కరోనా మృతుల అంత్యక్రియల కోసం రూ.15వేల ఆర్థిక సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story