తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ రైతులు.. ఎందుకంటే ?

by  |
TS-High-Court
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం రోజు రోజుకు ముదురుతోంది. విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ తెలంగాణ జెన్‌కో అధికారులను ఏపీ అధికారులు కోరినా పట్టించుకోవడ లేదు. ఇప్పటికీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండటంతో వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోతుంది. దీంతో కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఏపీ రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణాజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఉల్లంఘనలకు పాల్పడుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు వల్ల ఏపీ రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు గూడవల్లి శివరామ కృష్ణ ప్రసాద్, ఎమ్. వెంకటప్పయ్య అనే ఇద్దరు రైతులు తెలంగాణ హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

కేంద్ర జలవనరులశాఖ, కేఆర్ఎంబీ, తెలంగాణ జెన్ కో, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఏపీ ఇరిగేషన్ శాఖలను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు. జూన్‌ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్‌ చేయాలంటూ పిటిషన్‌‌లో పేర్కొన్నారు. నూరుశాతం విద్యుత్‌ ప్రాజెక్టులు పనిచేయాలంటూ జూన్‌ 28న తెలంగాణ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో నీటిని విడుదల చేయడం వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతింటున్నారని పిటిషన్‌లో రైతులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed