రాయలసీమ విషయంలో కేసీఆర్‌కు ఆ తపన ఉంది: ఏపీ డిప్యూటీ సీఎం

by  |
Deputy cm narayana swami ap
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జలవివాదాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని పరిష్కరించుకుంటే మంచిదన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్న తపన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందన్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం వద్దని హితవు పలికారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒకరంటే ఒకరికి అభిమానమన్నారు. ఆ అభిమానంతో ఇద్దరూ కలిసి చర్చించుకుంటే సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు.

Next Story