ఆగస్ట్ 31 తరువాత ఉండటానికి వీలులేదు: తాలిబన్

by  |
dead line
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘాన్‌లో ఆగస్ట్ 31 తరువాత విదేశీ దళాలు ఉండటానికి ఎంతమాత్రం అంగీకరించమని తాలిబన్ల అధికార ప్రతినిధి మహ్మద్ సుహైల్ షాహిన్ వెల్లడించారు. కాబూల్లో పౌరుల తరలింపు ప్రక్రియను తరలించటం కష్టంగా మారిందని, ఆగస్ట్ 31 వరకు వారిని వెనక్కి తీసుకురావటం ఎలా అంటూ బ్రిటిష్ రక్షణ మంత్రి జేమ్స్ వ్యాఖ్యలపై తాలిబన్లు పై విధంగా స్పందించారు. ఇచ్చిన గడువులోపు విదేశీ సైన్యం ఇక్కడ ఉన్నట్లయితే అది ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే భావిస్తామని షాహిన్ ఘాటుగా సమాధానమిచ్చారు. ఇది హింసకు దారి తీసే అవకాశాలే ఎక్కువని హెచ్చరించారు. ఇప్పటికే ఆఫ్ఘాన్ పరిస్థితులపై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ జీ7 దేశాల కూటమి సమావేశానికి పిలుపునిచ్చారు. దీనికి అమెరికా అధ్యక్షుడు సైతం ఓకే అన్నాడని తెలుస్తోంది. త్వరలో పారిశ్రామిక దేశాల కూటమి సమావేశమయ్యే తేదీని ప్రకటిస్తారని సమాచారం. అమెరికా ఉన్నంత వరకే దేశంలో బ్రిటిష్ దళాలు కొనసాగుతాయని రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్ ప్రకటించారు. తాము ఎంతమాత్రం ఆప్ఘాన్‌లో ఉండాలనుకోవటం లేదంటూ ఆయన బీబీసీకి చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed