అనుపమ్ ఖేర్ పోర్ట్‌ఫోలియో పిక్చర్స్ వైరల్.. స్టోరీ?

by  |
అనుపమ్ ఖేర్ పోర్ట్‌ఫోలియో పిక్చర్స్ వైరల్.. స్టోరీ?
X

దిశ, సినిమా : ప్రముఖ బాలీవుడ్ సపోర్టింగ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోర్ట్‌ఫోలియో పిక్చర్స్ షేర్ చేశారు. ఈ ఫొటోలో యంగ్ ఏజ్‌లో గడ్డంతో హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్న ఆయన.. దానితో పాటు ఓ అడ్రస్ కూడా షేర్ చేసి ఇందుకు సంబంధించిన స్టోరీ వివరించారు. సినిమానే జీవితం అనుకుని 1981 జూన్ 3న ముంబైలో అడుగుపెట్టిన అనుపమ్ ఖేర్.. తనకు మూవీలో క్యారెక్టర్ ఇప్పించాలని జూన్ 15న రాజశ్రీ ఫిల్మ్స్ కార్యాలయంలో ఈ ఫొటోలు ఇచ్చినట్లు తెలిపారు. అప్పటి వరకు ముంబై నగరంలో తనకు పర్టిక్యులర్ అడ్రస్ లేకపోవడంతో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో తన స్నేహితుడైన కె.రాజ్దాన్ చిరునామా ఇచ్చానని చెప్పారు.

కాగా ఈ 40 ఏళ్లలో రాజశ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు ‘సారాంశ్, హమ్ ఆప్ కే హై కౌన్, వివాహ్, ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రాల్లో నటించానని తెలిపారు. ఈ పిక్చర్ రాజశ్రీ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్‌కు చెందిన గుప్తాజీ పంపించడంతో షాక్ అయ్యానని.. దీన్ని వారి ప్రేమకు చిహ్నంగా భావిస్తున్నానని థాంక్స్ చెప్పారు.

Next Story

Most Viewed