జమ్ము కశ్మీర్‌లో బయటపడిన మరో సొరంగం

by  |
జమ్ము కశ్మీర్‌లో బయటపడిన మరో సొరంగం
X

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌ గుండా పోతున్న అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో మరో సొరంగం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) గుర్తించింది. 30 అడుగుల లోతులో మూడు అడుగుల వ్యాసంతోనున్న ఈ గుహ 150 మీటర్ల పొడువు ఉండి పాకిస్తాన్ వైపున మరో చివర ప్రారంభమై ఉండవచ్చునని మిలిటరీ అధికారులు భావిస్తున్నారు.

కథువా జిల్లాలో ఈ భారీ గుహ వెలుగులోకి వచ్చింది. హీరానగర్ సెక్టార్‌లో బార్డర్ ఔట్‌పోస్టు పన్సార్ ఏరియాలో ఈ గుహ ఉన్నది. పది రోజుల వ్యవధిలో జమ్ము కశ్మీర్‌లో కనిపించిన రెండో గుహ ఇది. ఈ గుహ చుట్టుపక్కల ప్రాంతంలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఇదే ఏరియాలో గతేడాది జూన్‌లో పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలను మోసుకెళ్తున్న డ్రోన్‌ను నేలకూల్చామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed